New page replaces cartoons- news at 11.

Above- https://rickpdx.wordpress.com/this-here/

Video, audio and other media devoted to Great Souls.

1 Comment

Filed under Uncategorized

One response to “New page replaces cartoons- news at 11.

  1. rathnamsjcc's avatar rathnamsjcc

    ఆత్మజ్ఞానము నిలో ఎంతవరకు సఫలమైనదో గ్రహించనెంచి ప్రశ్నించినపుడు సమాధానము: నీకిక చెప్పవలసినది ఇంకేమియును లేదనెను.జీవుడు దేవునికి వేరుగ బయట ఉండుటకు వీలులేదని బోధించెను. శరీరం, ప్రపంచం, భగవంతుడు సర్వాత్మనుండి ఉద్భవించి అందే లయించుచున్నవి. నేను అనగా శరీర ధ్యాస వచ్చినచో నీవు వేరు, భగవంతుడు వేరు. ఆత్మ జ్ఞానంతో అతడే నీవు. చూచేవాణ్ణి చూడ నేర్వాలి. అప్పుడు సమస్యలన్ని మాయమగును. నాది అన్నపుడు నీవు, శరీరం వేరే అవుతుంది. అలాగే నా శరీరం అన్నపుడు నీవు శరీరం కాదు. నీవు వేరే, శరీరం వేరేయని అర్ధం. నా ఇల్లు అన్నపుడు నేను ఇల్లుకాదు. ఇల్లు నాకు వేరుగ యున్నది. అట్టి నీలో వైకుంఠం, కైలాసం, స్వర్గం, ముక్తి, మోక్షం, బ్రహ్మ, వైకుంఠపురం నీలోనిదే.చూచే నేనును చూచేవారు ధన్యులు. నేనును (శరీరం) చూస్తూ అసలు ‘నేను’ను విస్మరించరాదు. శరీర భ్రాంతిని వీడి నా ‘నేను’లోమనస్సు నిలువాలి. సర్వమత సంబంధ, సమస్త జ్ఞానబోధల సారం ఇందే ఇమిడియున్నది. ఆధ్యాత్మిక జీవనమును కోరక తప్పదు. ప్రతి జీవి ఘనీభ వించిన మోక్ష స్వరూపమే. కాల పరిపాకమున ప్రతి పిందె కాయగ, పండుగ మారగలదు. పామర చిత్తులే పూత. ఫరిపక్వ హృదయులే ఫలములు. లేవండి! అలౌకిక దైవరాజ్యమును వెదకండి. అది బయట లేదు. మీలోనేగలదు. ఆత్మ విశ్వాసులై అఖండ దైవ సామ్రాజ్యమును మీలోనే స్వస్వరూపముగ దర్శించనేర్వండి.సకల చరాచర జీవ సమూహమును, తరులు, గిరులు, నరులు, అనే తార తమ్యం లోకుండా సమస్త ప్రవక్తలను, సమస్త గురువులను, బోధకులను, సమస్త పీఠాధిపతులను, , మాతలను, సమస్త దైవావ తారముల ఏకావస్ధలో, ఏకాత్మస్ధితిలో నిలిపి గాంచినపుడే నీ నిజస్వరూ పం బట్టబయలుగ గ్రాహ్యమై అనుభూతి కాగలదు. మనసు చైతన్యమై, పరిపూర్ణమైన బ్రహ్మానుభూతిని చవిచూస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. పరిశుద్ధ మానసమే పరమాత్మ స్వరూపం. ఈ దశలో మనసు బ్రహ్మాకారం గ వర్ధిల్లుతుంది. జాగ్రదావస్ధలో సుషుప్తి అనుభవమే సమాధి. నేను అనే మనసు మూలంలో అణగిపోయినపుడు ఎంతకాలమైనా ఆత్మయొక్క అవిచ్చిన్న పరిపూర్ణ ఆనందమును అనుభవించవచ్చు

    Like

Leave a comment